Andhra Pradesh: నో డౌట్... 2019లో అంతా శుభమే: చంద్రబాబు

  • ఎటువంటి సందేహమూ నాకు లేదు
  • ఏపీ తిరుగులేని శక్తిగా ఎదగాలి
  • టెలీ కాన్ఫరెన్స్ లో చంద్రబాబు
కొత్త ఏడాదిలో అందరికీ శుభమే కలుగుతుందని, అందులో ఎటువంటి సందేహం లేదని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ఏపీ తిరుగులేని శక్తిగా ఎదగాలని తాను కోరుకుంటున్నానని ఈ ఉదయం నీరు- ప్రగతి పురోగతిపై కలెక్టర్లు, అధికారులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన అన్నారు. అందుకు రానున్న కొత్త సంవత్సరమే నాంది పలకనుందని తెలిపారు. పంటల బీమాపై రాష్ట్ర ప్రభుత్వ వాటాను వెంటనే విడుదల చేయాలని నిర్ణయించామని, నిధులను పంపించేందుకు కేంద్రంపై అధికారులు ఒత్తిడి పెంచాలని సూచించారు.

2019లో ఏపీ మరింతగా ప్రగతి పథంలోకి వెళుతుందని, ఆ విషయంలో తనకు ఎటువంటి సందేహాలు లేవని వ్యాఖ్యానించిన చంద్రబాబు, కౌలు రైతులు తమ పంటలను వేసుకునేందుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేశామని తెలిపారు. 5,000 మంది కౌలు రైతులకు పంట రుణాలు ఇచ్చి, ఇండియాలోనే ఒక చరిత్ర సృష్టించామని చెప్పిన చంద్రబాబు, 2019లో చేయాల్సిన పనులపై కలెక్టర్లు, అధికారులకు పలు సూచనలు చేశారు.
Andhra Pradesh
Chandrababu
Tele Conference

More Telugu News