sankalp reddy: సన్నివేశం సహజంగా రావాలని చెబుతానంతే: దర్శకుడు సంకల్ప్ రెడ్డి

షార్ట్స్‌లో చూడండి
'ఘాజీ' .. 'అంతరిక్షం' సినిమాలతో విభిన్న కథా చిత్రాల దర్శకుడిగా సంకల్ప్ రెడ్డికి మంచి గుర్తింపు వుంది. చూడటానికి కాస్త బక్కపలచగా .. మొహమాటస్తుడిగా కనిపించే సంకల్ప్ రెడ్డి, తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. "నటీనటులకు నేను ఎక్స్ ప్రెషన్స్ కి సంబంధించి ఎక్కువ ఇన్ పుట్స్ ఇవ్వను. సీన్ గురించి వాళ్లకి వివరిస్తాను .. నాకు కావలసిన అవుట్ పుట్ గురించి చెబుతాను.

 సీన్ విన్న తరువాత సహజంగా వాళ్లు చేసే దానిని చూస్తాను. అవసరమైతే మళ్లీ ఒకసారి చేద్దామని చెబుతాను. మరోసారి చేసేటప్పుడు చిన్న చిన్న కరెక్షన్స్ చెబుతానంతే. ఇక టెక్నీషియన్స్ పనిలోనూ నేను ఎక్కువగా జోక్యం చేసుకోను. స్క్రిప్ట్ పూర్తయిన తరువాత నేను ఏమనుకుంటున్నది ముందుగానే వాళ్లకి చెప్పేస్తాను. సెట్స్ పైకి వెళ్లిన తరువాత అత్యవసరమైతే తప్ప మళ్లీ వాళ్ల పనిలో కల్పించుకోను .. నా బలం .. నా స్క్రిప్ట్" అని చెప్పుకొచ్చాడు. 
Go Back to Shorts
sankalp reddy

More Telugu News