lambasingi: లంబసింగిలో సున్నా డిగ్రీల ఉష్ణోగ్రత.. విశాఖ ఏజెన్సీపై పంజా విసిరిన చలి పులి

  • మినుములూరులో 3, పాడేరులో 4 డిగ్రీల ఉష్ణోగ్రత
  • తీవ్ర ఇబ్బందులకు గురౌతున్న పిల్లలు, వృద్ధులు
  • తెలంగాణను వణికిస్తున్న చలి గాలులు
విశాఖ ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. లంబసింగిలో సున్నా డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. చింతపల్లిలో 1.5 డిగ్రీలు, మినుములూరులో 3, పాడేరులో 4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 2010లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవగా... ఇప్పుడు మళ్లీ చలి పులి పంజా విసిరింది. వణికిస్తున్న చలిలో మన్నెం ప్రాంతంలోని పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. విపరీతమైన పొగమంచు కారణంగా సూర్యుడు ఉదయం 11 గంటల తర్వాతే దర్శనమిస్తున్నాడు. మరోవైపు తెలంగాణలో కూడా చలి గాలుల కారణంగా రాత్రి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి.
lambasingi
paderu
visakha
agency
temparature

More Telugu News