Rajamouli: రాజమౌళి కోడలి పల్లకీని స్వయంగా మోసిన ప్రభాస్... వీడియో!

  • జయపురలో ఒకటైన కార్తికేయ, పూజ
  • నిన్న రాత్రి వైభవంగా ముగిసిన వివాహం
  • సందడి చేసిన టాలీవుడ్ టాప్ హీరోలు
దర్శక దిగ్గజం ఎస్‌ఎస్‌ రాజమౌళి కొడుకు కార్తికేయ వివాహం, జగపతిబాబు అన్న కుమార్తె పూజాతో నిన్న రాత్రి అంగరంగ వైభవంగా ముగిసింది. రాజస్థాన్‌ లోని జయపుర‌ పట్టణంలోని ఓ ప్యాలెస్‌ ఈ వివాహానికి వేదిక కాగా, వరుడు కార్తికేయ, వధువు పూజా ప్రసాద్‌ ఒక్కటయ్యారు. ఈ వేడుకకు మూడు రోజుల ముందే చేరుకున్న టాలీవుడ్ సెలబ్రిటీలు ప్రభాస్‌, ఎన్టీఆర్, రామ్‌ చరణ్‌, ఉపాసన, అనుష్క, ఎంఎం కీరవాణి, జగపతిబాబు, రానా తదితరులు ఉత్సాహంగా పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. పెళ్లిలో సంగీత్ నుంచి అప్పగింతల వరకూ తారక్‌, ప్రభాస్, రామ్ చరణ్‌, రానాలు రాజమౌళితోనే కలిసుండటం గమనార్హం.

ఇదిలావుండగా, నిన్న పెళ్లి వేడుకకు ముందు పూజా ప్రసాద్ కూర్చున్న పల్లకిని ఆమె బంధువులతో పాటు ప్రభాస్‌ కూడా మోస్తూ వివాహ మండపానికి తీసుకు వచ్చారు. ప్రభాస్‌ పల్లకిని మోస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో ఇప్పుడు వైరల్‌ అవుతోంది. ఆ వీడియోను మీరూ చూడవచ్చు.



Rajamouli
Rana
Ramcharan
Prabhas
NTR
Kartikeya
Pooja
Jagapatibabu
Marriage

More Telugu News