బంగ్లాదేశ్ ఎన్నికలు ... బంపర్ మెజారిటీతో మళ్లీ అధికారంలోకి షేక్ హసీనా!
- మూడోసారి అధికారంలోకి షేక్ హసీనా
- ఘర్షణల్లో 17 మంది మృతి
- భారీ ఎత్తున రిగ్గింగ్ జరిగిందన్న ప్రతిపక్షం
హింసాత్మకంగా మారిన బంగ్లాదేశ్ ఎన్నికల్లో వివిధ ప్రాంతాల్లో 17 మంది మృతి చెందారు. వీరిలో అధికార అవామీ లీగ్ యూత్ విభాగమైన జుబో లీగ్ జనరల్ సెక్రటరీ మహ్మద్ బషీరుద్దీన్ కూడా ఉన్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణల్లో ఎక్కువ మంది మృతి చెందగా, పోలీసుల కాల్పుల్లో ముగ్గురు చనిపోయారు. చనిపోయిన వారిలో ఎక్కువమంది అధికార పార్టీకి చెందిన కార్యకర్తలే ఉన్నారు.