Kajal Agarwal: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • పాత్ర గురించి కాజల్ టెన్షన్  
  • ప్రభాస్ లవ్ స్టోరీ అప్ డేట్ 
  • త్వరలో సెట్స్ పైకి 'నటసామ్రాట్'
*  ఇన్నాళ్లూ గ్లామరస్ నాయికగా కనిపించిన కాజల్ అగర్వాల్ ఇప్పుడు విలన్ గా కనిపించనుంది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తేజ దర్శకత్వంలో రూపొందుతున్న 'సీత' చిత్రంలో కాజల్ ఇలా నెగటివ్ టచ్ వున్న పాత్రను పోషిస్తోంది. అయితే, కెరీర్లో తొలిసారిగా నెగటివ్ పాత్ర పోషిస్తుండడంతో ప్రేక్షకులు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారన్న టెన్షన్లో కాజల్ వుందని అంటున్నారు.
*  ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందే ప్రేమకథా చిత్రం గురించి ఆసక్తికర విషయం తెలిసింది. ఈ చిత్ర కథ ప్రఖ్యాత ఆంగ్ల రచయిత షేక్స్ పియర్ రాసిన 'రోమియో అండ్ జూలియట్' ట్రాజెడీ ఆధారంగా తెరకెక్కనుందట. ఇందులో ఇటలీలో స్థిరపడిన ధనవంతుడి పాత్రలో ప్రభాస్, పేదింటి అమ్మాయిగా కథానాయిక పూజా హెగ్డే నటిస్తారట.
*  ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వం వహించే తాజా చిత్రం షూటింగ్ త్వరలో మొదలవుతుంది. నానా పటేకర్ నటించిన మరాఠీ చిత్రం 'నటసామ్రాట్' ఆధారంగా దీనిని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు ముగింపు దశకు చేరాయి. ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్ర పోషిస్తాడు.
Kajal Agarwal
Teja
Prabhas
Pooja

More Telugu News