vijayashanthi: రెండోసారి అధికారంలోకి వచ్చారు కదా.. అహంకారం పెరిగింది: విజయశాంతి

  • అహంకారం నెత్తికెక్కింది
  • సీఎం హోదాలో ఉన్న వ్యక్తి మాట్లాడే మాటలేనా ఇవి
  • కేసీఆర్ వ్యాఖ్యలతో సభ్య సమాజం సిగ్గుపడుతోంది
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌‌పై కాంగ్రెస్ నేత విజయశాంతి మండిపడ్డారు. మంగళవారం విలేకరుల సమావేశం పెట్టి మరీ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, కాంగ్రెస్ నేతలను కేసీఆర్ పరుష పదజాలంతో దూషించడాన్ని తప్పు బట్టారు. రెండోసారి అధికారంలోకి రావడంతో టీఆర్ఎస్ అధినాయకత్వానికి అహంకారం నెత్తికెక్కిందని విమర్శించారు. అహంకారంతోనే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.  

మరోవైపు, టీపీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్‌లు కూడా కేసీఆర్ తీరును తప్పుబట్టారు. కాంగ్రెస్ నేతలను ఇడియట్స్ అంటారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాల్సిన ముఖ్యమంత్రి తన స్థాయిని తగ్గించుకుని అహంకారంతో ఇలా మాట్లాడడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడడాన్ని చూసి సభ్యసమాజం సిగ్గుపడుతోందన్నారు.
vijayashanthi
Telangana
TRS
KCR
Congress
Chandrababu

More Telugu News