Hyderabad: ఫిలింనగర్‌లో అతి వేగంతో వాహనాలపైకి దూసుకెళ్లిన కారు.. చిరు వ్యాపారి మృతి

  • షేక్‌పేట వైపునకు వెళుతున్న కారు
  • శ్రీనివాసరావుకు తీవ్ర గాయాలు
  • ఆసుపత్రికి తరలిస్తుండగానే మృతి
హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌లో అతి వేగంగా దూసుకొచ్చిన ఓ కారు చిరు వ్యాపారి ప్రాణం తీసింది. ఫిలింనగర్ నుంచి షేక్‌పేట్ వైపునకు అతి వేగంతో వెళుతున్న కారు వాహనాలపైకి దూసుకెళ్లడంతోపాటు.. తోపుడు బండిపై పండ్లు అమ్ముకుంటున్న శ్రీనివాసరావును ఢీకొట్టింది. దీంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు శ్రీనివాసరావును చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. పోలీసుల విచారణలో శ్రీనివాసరావు స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు అని తెలిసింది. కాగా మృతుడి బంధువులు కారు డ్రైవర్‌ను కఠినంగా శిక్షించాలని కోరుతూ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Hyderabad
Filmnagar
Srinivasa Rao
Car Accident
police

More Telugu News