Chandrababu: నన్ను మానసికంగా దెబ్బ తీసే శక్తి ఎవరికీ లేదు: సీఎం చంద్రబాబు

షార్ట్స్‌లో చూడండి
ఏపీ సీఎం చంద్రబాబునాయుడిపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేకెత్తిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యల విషయమై చంద్రబాబును మీడియా ప్రశ్నించగా ఆసక్తికర సమాధానం చెప్పారు.

‘మిమ్మల్ని మానసికంగా దెబ్బతీసేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా?’ అని ప్రశ్నించగా, ‘నన్ను మానసికంగా ఎవరు దెబ్బతీస్తారు? నన్ను మానసికంగా దెబ్బతీసే శక్తి ఎవరికీ లేదు. ఎన్నో సంక్షోభాలు చూశాను’ అని ఆయన సమాధానమిచ్చారు. హుందాగా వ్యవహరించడాన్ని చేతగానితనంగా తీసుకోవద్దని, ఇష్టానుసారం మాట్లాడొద్దని కేసీఆర్ కు చంద్రబాబు హితవు పలికారు.
Go Back to Shorts
Chandrababu
kcr
cm
TRS
Telugudesam
Andhra Pradesh
Telangana

More Telugu News