kcr: సింహాన్ని తట్టి లేపావు.. ఇక కాస్కో చంద్రబాబు!: బాల్క సుమన్ ఘాటు వ్యాఖ్యలు

షార్ట్స్‌లో చూడండి
‘చంద్రబాబునాయుడు.. ఇక సింహం రంగంలోకి దిగింది. నువ్వు తోక ముడుచుకోవాల్సిందే’ అంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అనవసరంగా, తెలంగాణ ఎన్నికల్లో, రాజకీయాల్లో వేలు పెట్టి, మా కేసీఆర్ గారిని తిట్టి, మమ్మల్ని తిట్టి గోక్కున్నావు. సింహాన్ని తట్టి లేపినావు. ఇక కాస్కో. నువ్వు ఫేస్ చేయాల్సిందే. ఇన్ని రోజులు నడిచిపోయింది కానీ, ఇప్పుడు నడవదు.

డెఫినెట్ గా, బ్రహ్మండమైన పాత్ర పోషిస్తాము చంద్రబాబునాయుడు.. రిటర్న్ గిఫ్ట్ కచ్చితంగా ఉంటుంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇప్పటికైనా చంద్రబాబునాయుడు, ఆయన గ్యాంగ్ నిజస్వరూపాన్ని  తెలుసుకోండి.  ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి కేసీఆర్ గారు ఎక్కడా కూడా అడ్డురాలేదు. ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు. మా తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్ర రాష్టం అభివృద్ధి కావాలి. భారతదేశం కూడా అభివృద్ధి కావాలని కేసీఆర్ కోరుకుంటున్నారు’ అని చెప్పుకొచ్చారు.
Go Back to Shorts
kcr
TRS
Chandrababu
Telugudesam
balka suman

More Telugu News