kcr: కేసీఆర్ అక్కడ మాట్లాడతాడు.. జగన్ ఇక్కడ ట్వీట్ చేస్తాడు: చంద్రబాబు ఎద్దేవా

  • వీళ్లిద్దరినీ అభినందిస్తూ మోదీ ఫోన్ చేస్తారు
  • ఫెడరల్ ఫ్రంట్ అని కేసీఆర్ అంటున్నారు
  • ఫెడరల్ ఫ్రంట్ లో కాకపోతే నేషనల్ ఫ్రంట్ లో చేరండి!
తనను విమర్శిస్తూ కేసీఆర్ అక్కడ మాట్లాడితే, జగన్ ఇక్కడ ట్వీట్ చేస్తాడని, వీళ్లిద్దరినీ అభినందిస్తూ నరేంద్ర మోదీ ఫోన్ చేస్తారని ఏపీ సీఎం చంద్రబాబు ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. అమరావతిలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఫెడరల్ ఫ్రంట్ లో చేరతానని కేసీఆర్ చెబుతున్నాడని, ’చేరండి.. నేషనల్ ఫ్రంట్ లో చేరండి.. డెమోక్రటిక్ అలయెన్స్ లో చేరండి.. బ్రహ్మాండం.. మేము కాదంటామా?’ అని సెటైర్లు విసిరారు. తన కథ మీకెవరికీ అర్థం కాదని, రాబోయే రోజుల్లో హైకమాండ్ స్కీమ్ అర్థమవుతుందని కేసీఆర్ అంటున్నారని, ఎన్నికలు అయ్యే వరకు అది ఎవరికీ అర్థం కాదుట అంటూ సెటైర్లు విసిరారు. కేసీఆర్ ఓ స్ట్రాటజిస్ట్ అని, అయితే ఆ స్ట్రాటజీలు, కుట్రలు, కుతంత్రాలు అన్నివేళలా పనిచేయవని విమర్శించారు.
kcr
Jagan
modi
Chandrababu
Telugudesam
TRS
bjp
YSRCP
Andhra Pradesh
Telangana

More Telugu News