modi: ఆయన తిట్టిస్తుంటే ఈయన ఎగబడి నన్ను తిడుతున్నారు: మోదీ, కేసీఆర్ లపై చంద్రబాబు ఫైర్

  • మోదీని ప్రశ్నించడంతో పర్యటన రద్దు చేసుకున్నారు
  • కేసీఆర్ తో నన్ను తిట్టిస్తున్నారు
  • చాలా తెలివైన నాయకుడు
ఏపీలో వచ్చే నెలలో పర్యటించాలనుకున్న ప్రధాని మోదీని ‘మేము చచ్చామా? బతికామో చూడటానికి వస్తున్నారా? అని ప్రశ్నించడంతో తన పర్యటనను రద్దు చేసుకున్నారని సీఎం చంద్రబాబు విమర్శించారు. అమరావతిలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘ఆయన (మోదీ) రాకుండా కేన్సిల్ చేసుకున్నారు. ఆయన ఈయన్ని (కేసీఆర్)  పెట్టి తిట్టిస్తున్నారు. చాలా తెలివైన నాయకుడు కదా? ఈయన ఎగబడి తిడుతున్నాడు. మీరు ఎందుకు నన్ను తిట్టాల్సి వచ్చింది?’ అని ప్రశ్నించారు.

హైకోర్టు విభజనను స్వాగతిస్తున్నామని, అదే సమయంలో, కొంత సమయం కావాలని అడిగామని, అలా అడగం తప్పా? అని ప్రశ్నించారు. ‘మా మీద రుబాబు చేయాలనుకుంటున్నారా? బెదిరించడం, బ్లాక్ మెయిల్ చేయడం.. లేకపోతే ఏదో చేస్తామంటారు? కేసులు పెడతారా? నువ్వు ఒక కేసు పెడితే నేను నాలుగు కేసులు పెడతా?’ అని కేసీఆర్ ను హెచ్చరించారు.
modi
kcr
ch
Telugudesam
BJP
TRS
Andhra Pradesh

More Telugu News