BJP: కేసీఆర్‌ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా మాటల దాడి ఎందుకు?: టీడీపీకి బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి ప్రశ్న

  • హైకోర్టు భవనాలు సిద్ధంగా ఉన్నాయన్నారు
  • ఇప్పుడు సౌకర్యాలు లేవంటున్నారు
  • కేంద్రం ఇచ్చిన రూ.500 కోట్లు ఏం చేశారు
హైకోర్టు విభజన అనంతరం గగ్గోలు పెడుతున్న టీడీపీ నేతలు మాటల దాడి మానేసి తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు అడిగిన ప్రశ్నలకు ముందు సమాధానం చెప్పాలని బీజేపీ ఏపీ నేత విష్ణువర్థన్‌రెడ్డి సూచించారు. ఆదివారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు.

హైకోర్టు ఏర్పాటుచేస్తే అందుకు అవసరమైన భవనాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పింది తెలుగుదేశం ప్రభుత్వమే కదా? అని ప్రశ్నించారు. తీరా విభజన జరిగాక సదుపాయాల్లేవంటున్నారెందుకని ప్రశ్నించారు. అలా అయితే భవనాల నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన రూ.500 కోట్లు ఏం చేశారని ప్రశ్నించారు. ఇప్పటికైనా టీడీపీ నేతలు అనవసర రాద్ధాంతానికి స్వస్తి పలికి వాస్తవాలు వెల్లడించాలని కోరారు.
BJP
visnhuvardhanreddy
Telugudesam

More Telugu News