NTR: అల్లూరిగా బాలయ్య... ఔరా అనిపిస్తున్న 'ఎన్టీఆర్' బయోపిక్ లుక్!

షార్ట్స్‌లో చూడండి
తన కెరీర్ లో చేద్దామనుకుని, చేయలేకపోయిన ఏకైక పాత్ర మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుదేనని దివంగత ఎన్టీఆర్ ఎన్నోమార్లు ఇంటర్వ్యూల్లో చెప్పారు. తన ముచ్చటను తీర్చుకునేందుకు 'మేజర్ చంద్రకాంత్' చిత్రంలో వచ్చే ఓ పాటలో కాసేపు అల్లూరిగా కనిపించారు కూడా.

ఇప్పుడిక ఆయన జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న 'ఎన్టీఆర్' బయోపిక్ లో తన తండ్రి పాత్రను స్వయంగా పోషిస్తున్న బాలకృష్ణ కూడా కొన్ని క్షణాల పాటు అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు. చిత్రం ప్రమోషన్ లో భాగంగా, అల్లూరిగా బాలయ్యను చూపిస్తూ విడుదల చేసిన పోస్టర్ ను చూసిన అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఈ పోస్టర్‌ లో బాలకృష్ణ అచ్చం ఎన్టీఆర్ మాదిరే కనిపిస్తున్నారని కితాబునిస్తూ, సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
Go Back to Shorts
NTR
Balakrishna
Biopic
Alluuri Seetaramaraju

More Telugu News