The Accidental PM: అనుకోకుండా ప్రధానమంత్రిని అయ్యాను నేను: దేవెగౌడ

  • 'ది యాక్సిడెంటల్ పీఎం' పై వివాదం
  • సినిమాలో ఏముందో నాకు తెలియదు
  • మీడియాతో మాజీ ప్రధాని దేవెగౌడ
తాను కూడా అనుకోకుండా ప్రధానమంత్రి బాధ్యతలు స్వీకరించిన వ్యక్తినేనని జేడీ (ఎస్) నేత, మాజీ ప్రధాని దేవెగౌడ వ్యాఖ్యానించారు. మన్మోహన్ సింగ్ జీవిత చరిత్ర ఆధారంగా నిర్మించిన 'ది యాక్సిడెంటల్ ప్రైం మినిస్టర్' పై వివాదం కొనసాగుతున్న వేళ, దేవెగౌడ స్పందించారు. ఈ సినిమాపై ఏం వివాదముందో తనకు తెలియదని, ఆ మాటకొస్తే తాను సైతం యాక్సిడెంటల్ పీఎంనేనని అన్నారు.

కాగా, 1996లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఏ పార్టీకి కూడా మెజారిటీ రాకపోవడంతో బయటి నుంచి కాంగ్రెస్ ఇచ్చిన మద్దతుతో బీజేపీయేతర పార్టీలు కొన్ని యునైటెడ్ ఫ్రంట్ గా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అప్పట్లో దేవెగౌడ ప్రధానిగా పనిచేశారన్న సంగతి తెలిసిందే. 2004 నుంచి 2008 వరకూ మన్మోహన్ సింగ్ వద్ద మీడియా అడ్వయిజర్ గా పనిచేసిన సంజయ్ బారు రచించిన 'ది యాక్సిడెంటల్ ప్రైం మినిస్టర్' ఆధారంగా సినిమా తెరకెక్కగా, ఇందులో అభ్యంతరకర సన్నివేశాలున్నాయని, వాటిని తొలగించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. 
The Accidental PM
Devegouda
Manmohan Singh
Congress

More Telugu News