Chandrababu: కేసీఆర్ 'ముందుపోటు' మాత్రమే పొడుస్తారు... ‘వెన్నుపోటు’ పొడవరు!: వర్మ సెటైర్

  • కేసీఆర్‌ ముందు పోటు మాత్రమే పొడుస్తారంటూ ట్వీట్
  • అందుకే ఆయనంటే తనకు ఇష్టమన్న వర్మ
  • ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ప్రమోషన్ కోసం సీఎంలను వాడేసుకుంటున్న వర్మ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు-తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్య జరుగుతున్న మాటల యుద్ధంలో సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ వేలుపెట్టాడు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రంతో బిజీగా ఉన్న వర్మ వీరిద్దరి మధ్య రగులుతున్న మాటల యుద్ధాన్ని తన చిత్రం ప్రమోషన్ కోసం ఉపయోగించుకుంటున్నాడు.

శనివారం సాయంత్రం కేసీఆర్ విలేకరుల సమావేశం పెట్టి మరీ చంద్రబాబును తీవ్రంగా తిట్టిపోసిన తర్వాత ఏపీ నేతలు అంతే ఘాటుగా కేసీఆర్‌కు కౌంటర్ ఇచ్చారు. నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తుండగానే వర్మ స్పందించాడు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుపోటు మాత్రమే పొడుస్తారని, ‘వెన్నుపోటు’ పొడవరని, అందుకే ఆయనంటే తనకిష్టమని పేర్కొంటూ ట్వీట్ చేసి మరింత అగ్గిరాజేశాడు. అంతకుముందు చేసిన ట్వీట్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్‌ అనుచిత వ్యాఖ్యలపై కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి కేసు పెట్టినట్టు తనకు తెలిసిందని వర్మ పేర్కొన్నాడు.
Chandrababu
KCR
Ram gopal varma
Director
Telangana
Andhra Pradesh
Lakshmi's NTR

More Telugu News