KCR: మాయ మాటలు చెప్పి గెలిచినంత మాత్రాన మొనగాడివి కాలేవు: కేసీఆర్‌పై సోమిరెడ్డి ధ్వజం

  • సీఎం అయితే ఇంత ఛండాలంగా మాట్లాడుతారా?
  • కేసీఆర్ మాటల్లో ఒక్కటైనా వాస్తవముందా?
  • ఇచ్చిన హామీలన్నీ ఏమయ్యాయి?
  • దరిద్రమైన భాష ఉపయోగించారు
ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ఇంత ఛండాలంగా మాట్లాడతారా? అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ సీఎం చంద్రబాబుపై కేసీఆర్ దరిద్రమైన భాష ఉపయోగించారని ధ్వజమెత్తారు. మాయమాటలు చెప్పి గెలిచినంత మాత్రాన మొనగాడివి కాలేవంటూ కేసీఆర్‌పై సోమిరెడ్డి నిప్పులు చెరిగారు.

కేసీఆర్ మాటల్లో ఒక్కటైనా వాస్తవముందా? అని ప్రశ్నించారు. కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ ఏమయ్యాయి?.. దళితుడిని సీఎంని చేస్తానన్న కేసీఆర్ మాట ఏమైందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఏం మోసం చేశారో చెప్పాలన్నారు. తెలంగాణ కంటే ఏపీ అభివృద్ధిలో ముందుందన్నారు. కేసీఆర్ భాషను ఎవరూ హర్షించరని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు.
KCR
Chandrababu
Somireddy chandramohan Reddy
Telangana
Andhra Pradesh

More Telugu News