modi: నేను కాపలాదారుడినే.. దొంగలను ఏదో ఒక రోజు సరైన ప్రదేశానికి పంపుతా: మోదీ

  • కాపలాదారుడిగా రేయింబవళ్లు పని చేస్తున్నా
  • నా వల్ల కొందరు దొంగలకు నిద్ర పట్టడం లేదు
  • కాంగ్రెస్ చెబుతున్న అసత్యాల పట్ల జాగ్రత్తగా ఉండండి
కాపలాదారుడే దొంగ అయ్యాడంటూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలపై ప్రధాని మోదీ అదే స్థాయిలో స్పందించారు. ఉత్తరప్రదేశ్ లోని ఘాజీపూర్ లో వైద్య కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ, దేశానికి కాపలాదారుడిగా రేయింబవళ్లు కష్టపడి పని చేస్తున్నానని చెప్పారు. తన వల్ల కొందరు దొంగలకు నిద్ర పట్టడం లేదని అన్నారు. దొంగలను ఏదో ఒక రోజు సరైన ప్రదేశానికి పంపడానికి మీ నమ్మకమే నాకు బలాన్నిస్తుందని చెప్పారు.

కాంగ్రెస్ నేతలు చెబుతున్న అసత్యాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మోదీ అన్నారు. రైతు రుణమాఫీ చేస్తామంటూ కర్ణాటక ఎన్నికలల్లో కాంగ్రెస్ మభ్యపెట్టిందని... ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో కేవలం 800 మంది రైతుల రుణాలు మాత్రమే మాఫీ అయ్యాయని విమర్శించారు. ఇప్పుడు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని... ఆ రాష్ట్రాల్లో అప్పుడే రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు చేయలేని రుణమాఫీని... ఇప్పుడు ఎలా చేయగలుగుతుందని ప్రశ్నించారు. 
modi
congress
bjp
chowkidar

More Telugu News