jagan: పాదయాత్ర ముగియగానే.. తిరుమల వెంకన్నను దర్శించుకోనున్న జగన్

  • జనవరి 8 లేదా 9న ముగియనున్న జగన్ పాదయాత్ర
  • ఇచ్ఛాపురం నుంచి నేరుగా తిరుపతి పయనం
  • మరుసటి రోజు శ్రీవారికి మొక్కులు చెల్లించుకోనున్న జగన్
వైసీపీ అధినేత జగన్ జనవరి రెండో వారంలో తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకోనున్నారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. జగన్ తిరుమల పర్యటన నేపథ్యంలో తిరుపతిలోని పార్టీ శ్రేణులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జనవరి 8 లేదా 9న జగన్ పాదయాత్ర ముగిసే అవకాశం ఉందని చెప్పారు.

గతంలో వైయస్సార్ ఇచ్ఛాపురంలో పాదయాత్రను ముగించారని... అదే తరహాలో జగన్ కూడా ఇచ్ఛాపురంలో పాదయాత్రను ముగిస్తారని తెలిపారు. అదే రోజున ఆయన తిరుపతికి చేరుకుని విశ్రాంతి తీసుకుంటారని చెప్పారు. మర్నాడు ఉదయం అలిపిరికి చేరుకుని, మెట్ల దారిలో కొండపైకి చేరుకుని, స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారని తెలిపారు.
jagan
bhumana karunakar reddy
Tirupati
Tirumala

More Telugu News