ధనుశ్ .. నాగ్ మూవీపై కోలీవుడ్ టాక్
- మల్టీస్టారర్ మూవీలపై నాగ్ ఆసక్తి
- ధనుశ్ తో కలిసి చేయాల్సిన ప్రాజెక్ట్
- ఆర్థిక ఇబ్బందుల్లో నిర్మాతలు
'మారి 2' తరువాత మల్టీ స్టారర్ సెట్స్ పైకి వెళ్లవలసి వుంది. కానీ ధనుశ్ తాను సోలో హీరోగా చేస్తోన్న 'అసురన్' సినిమాను మొదలుపెట్టేశాడు. దాంతో నాగ్ తో ఆయన చేయనున్న సినిమాపై కోలీవుడ్లో ఒక టాక్ వినిపిస్తోంది. ఆర్థికపరమైన ఇబ్బందుల కారణంగా నిర్మాతలు ఈ ప్రాజెక్టును పక్కన పెట్టేశారని చెప్పుకుంటున్నారు. అయితే ఆలస్యంగా పట్టాలెక్కిస్తారా .. అసలు ఆ ఉద్దేశమే లేదా? అనే విషయంలో క్లారిటీ రావలసి వుంది.