kcr: కేసీఆర్ నిర్వహించనున్న మహా యాగం వివరాలు!

  • ఐదు రోజుల పాటు కొనసాగనున్న మహారుద్ర సహిత సహస్ర చండీ యాగం
  • నాలుగు రోజుల పాటు వెయ్యి సప్తశతి చండీ పారాయణాలు
  • చివరి రోజున 11 యజ్ఞ కుండలాల వద్ద హోమం
మరో మహా యాగానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధమయ్యారు. మహారుద్ర సహిత సహస్ర చండీ యాగాన్ని కేసీఆర్ నిర్వహించనున్నారు. జనవరి 21 నుంచి 25 వరకు ఐదు రోజుల పాటు యాగం సాగనుంది. ఏకోత్తర వృద్ధి సంప్రదాయంలో ఈ యాగం జరగనుంది. తొలి రోజు 100 సప్తశతి చండీ పారాయణాలు చేస్తారు. రెండో రోజు 200, మూడో రోజు 300, నాలుగో రోజు 400 పారాయణాలు చేస్తారు. అన్నీ కలిపితే వెయ్యి పారాయణాలు అవుతాయి.

ఐదవ రోజున 11 యజ్ఞ కుండలాల వద్ద... ఒక్కో కుండలం వద్ద 11 మంది రుత్విక్కులతో 100 పారాయణాలతో హోమం నిర్వహిస్తారు. అనంతరం పూర్ణాహుతితో యాగం పరిసమాప్తమవుతుంది. ప్రతి రోజు సాయంత్రం భాగవత, రామాయణ పారాయణం చేస్తారు.
kcr
yagam
telangana
details
yagna

More Telugu News