madhavan: 'సైలెన్స్'లో అంధురాలి పాత్రలో అనుష్క?

  • అనుష్క తాజా చిత్రంగా 'సైలెన్స్'
  • అనూహ్యమైన మలుపులతో సాగే కథ 
  • జనవరిలో సెట్స్ పైకి     

కథాకథనాల్లో కొత్తదనం .. పాత్ర పరంగా వైవిధ్యం ఉంటేనే అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. 'భాగమతి' తరువాత తన మనసుకి నచ్చిన కథలు తగలకపోవడం వల్లనే గ్యాప్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే హేమంత్ మధుకర్ వినిపించిన కథ అనుష్కకి చాలా భిన్నంగా అనిపించిందట. ఇంతరవరకూ తాను ఈ తరహా పాత్రను పోషించకపోవడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.

రీసెంట్ గా ఈ సినిమాకి 'సైలెన్స్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమాలో చూపు .. వినికిడి శక్తి లేని పాత్రలో అనుష్క కనిపించనుందనేది తాజా సమాచారం. ఆమె పాత్ర చుట్టూనే కథ మొత్తం తిరుగుతుంది. అనూహ్యమైన మలుపులతో .. ఉత్కంఠభరితంగా ఈ కథ కొనసాగుతుందని అంటున్నారు. అనుష్క సరసన మాధవన్ కనిపించనున్నాడు. కోన ఫిల్మ్ కార్పొరేషన్ .. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమా, జనవరిలో సెట్స్ పైకి వెళ్లనుంది. 

More Telugu News