ambala highway: ప్రాణాలు తీసిన మంచుదుప్పటి.. హైవేపై వాహనాలు ఢీకొని ఏడుగురి మృతి

  • పలువురికి తీవ్రగాయాలు
  • ఎదురెదురుగా వస్తున్న వాహనాలు ఢీకొట్టడంతో ప్రమాదం
  • అంబాలా-చండీగడ్‌ జాతీయ రహదారిపై ఘటన
పొగమంచు ప్రాణాలు తీసింది. అంబాలా-చండీగడ్‌ జాతీయ రహదారిపై వాహనాలు ఒకదాన్ని మరొకటి ఢీకొట్టిన ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. చండీగఢ్‌ వైపు నుంచి వస్తున్న రెండు వాహనాలు మంచు కారణంగా ఎదురుగా ఏమీ కనిపించకపోవడంతో పరస్పరం ఢీకొట్టుకుని, ఎదురుగా వస్తున్న మరో వాహనంపైకి దూసుకుపోవడంతో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.

దీంతో ఆ వాహనాల్లో ఉన్న వారిలో ఏడుగురు చనిపోయారు. మృతులందరూ చండీగఢ్‌కు చెందిన వారిగా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.  
ambala highway
Road Accident
7 died

More Telugu News