Nalgonda District: ప్రణయ్-అమృత ఇంటికి తరచుగా వస్తున్న వ్యక్తి.. కేసు నమోదు చేసిన పోలీసులు!

  • అమృత ఇంటికి వస్తున్న వినోద్ 
  • స్థానికంగా టెక్స్ టైల్ వ్యాపారం నిర్వహణ
  • ఫోన్ చూసి షాక్ కు గురైన ప్రణయ్ తల్లిదండ్రులు
నల్లగొండ జిల్లాలో ప్రణయ్ పరువు హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రణయ్-అమృత ఇంటికి వచ్చిన ఓ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మిర్యాలగూడ పట్టణంలోని కార్తీక్ టెక్స్ టైల్ దుకాణం నడుపుతున్న వినోద్ కుమార్ అనే వ్యక్తి.. ఇటీవలి కాలంలో ప్రణయ్-అమృత ఇంటికి ఏదో సాకు చెప్పి తరచుగా వస్తున్నాడు.

అయితే అతని ప్రవర్తనపై అనుమానం రావడంతో వాళ్లు వినోద్ సెల్ ఫోన్ ను పరిశీలించారు. దీంతో అమృత తల్లితో వినోద్ కుమార్ మాట్లాడుతున్నట్లు ప్రణయ్ తల్లిదండ్రులు, అమృత గుర్తించారు. వెంటనే మిర్యాలగూడ పోలీస్ స్టేషన్ లో అతనిపై ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో నిందితుడు వినోద్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. 
Nalgonda District
Telangana
pranay
amruta
honour killing
police
vinod

More Telugu News