aicc ap incharge: కాంగ్రెస్‌ పార్టీ ఏపీ వ్యవహారాల ఇన్‌ఛార్జి మయ్యప్పన్‌ నేడు గుంటూరు రాక

  • గుంటూరు, నరసరావుపేట లోక్‌సభ నియోజకవర్గాల ఇన్‌ఛార్జిలతో సమావేశం
  • ఉదయం నరసరావుపేట... మధ్యాహ్నం గుంటూరు సమీక్ష
  • భవిష్యత్తు ఎన్నికల నేపథ్యంలో సమావేశం
ఆంధ్రప్రదేశ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి, ఆలిండియా కాంగ్రెస్‌ కమిటీ కార్యదర్శి మయ్యప్పన్‌ నేడు గుంటూరుకు వస్తున్నారు. పార్టీ వ్యవహారాలపై స్థానిక నాయకులతో సమావేశం కానున్నారు. ఈ విషయాన్ని పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు మక్కెన మల్లికార్జునరావు వెల్లడించారు.

 గుంటూరు పార్టీ కార్యాలయంలో నేటి ఉదయం నరసరావుపేట నియోజకవర్గం ఇన్‌ఛార్జిలతో సమావేశమై పార్టీ పరమైన అంశాలపై చర్చిస్తారని తెలిపారు. మధ్యాహ్నం రాజీవ్‌గాంధీ భవన్‌లో గుంటూరు నియోజకవర్గం ఇన్‌ఛార్జిలతో సమావేశం ఉంటుందని మల్లికార్జునరావు తెలిపారు. రానున్న ఎన్నికల దృష్ట్యా పార్టీ పరిస్థితిపై చర్చించేందుకే ఈ సమావేశాలని భావిస్తున్నారు.
aicc ap incharge
Guntur District

More Telugu News