Mahesh Babu: సుకుమార్ కంటే ముందుగా మరో దర్శకుడితో మహేశ్ బాబు?

  • వంశీ పైడిపల్లితో 'మహర్షి'
  • కథ సిద్ధం చేయని సుకుమార్ 
  • మరో దర్శకుడితో మహేశ్ బాబు     
ప్రస్తుతం మహేశ్ బాబు .. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'మహర్షి' సినిమా చేస్తున్నాడు. ఏప్రిల్ 5వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. దాంతో మహేశ్ బాబు తదుపరి ప్రాజెక్టుపై దృష్టిపెట్టాడు. తదుపరి సినిమాను సుకుమార్ తో చేయాలని ఆయన భావించాడు. అయితే సుకుమార్ వినిపించిన రెండు కథలు కూడా మహేశ్ బాబుకి నచ్చలేదు.

మరో కథను రెడీ చేసి వినిపించడానికి తనకి కొంత సమయం పడుతుందని సుకుమార్ చెప్పాడట. దాంతో ఈ గ్యాప్ లో మహేశ్ బాబు మరో సినిమా చేయాలనే నిర్ణయం తీసుకున్నాడు. ఏప్రిల్లో 'మహర్షి' వస్తుంది గనుక, తరువాత సినిమాను దసరాకి విడుదల చేస్తే బాగుంటుందని ఆయన భావిస్తున్నాడని సమాచారం. అయితే ఈ సినిమా ఏ దర్శకుడితో ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. రాజమౌళి .. త్రివిక్రమ్ .. బోయపాటి .. కొరటాల అంతా కూడా ఎవరి ప్రాజెక్టులతో వాళ్లు బిజీగా వున్నారు. మహేశ్ బాబు ఏం చేస్తాడో చూడాలి మరి. 
Mahesh Babu

More Telugu News