Rahul Gandhi: మన్మోహన్‌తో కేక్ కట్ చేయించిన రాహుల్ గాంధీ.. ఫొటోలు వైరల్

  • కాంగ్రెస్ పార్టీ 134వ వార్షికోత్సవం
  • మన్మోహన్‌తో కేక్ కట్ చేయించి తినిపించిన రాహుల్
  • ఏకే ఆంటోనీ జన్మదినం సందర్భంగా మరో కేక్
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చేయి పట్టుకుని కేక్ కట్ చేయిస్తున్న ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా తిరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ 134వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేశారు.

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సహా పలువురు కాంగ్రెస్ నేతలు హాజరైన ఈ కార్యక్రమంలో మన్మోహన్ చేయి పట్టుకుని మరీ రాహుల్ గాంధీ కేక్ కట్ చేయించారు. అనంతరం కేకు ముక్కను మన్మోహన్‌కు తినిపించారు. పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పార్టీ జెండాను ఎగురవేశారు. కాగా, కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ ఏకే ఆంటోనీ జన్మదినం కూడా శుక్రవారమే కావడంతో మరో కేక్ కట్ చేసి పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు.
Rahul Gandhi
Manmohan singh
Congress
Cake cutting
AK antony

More Telugu News