KCR: పంచాయతీ ఎన్నికల బాధ్యతను ఎమ్మెల్యేలకే అప్పగించిన కేటీఆర్

  • పార్టీ బలోపేతం కోసం జిల్లాల్లో పర్యటించాలి
  • కేసీఆర్‌తో చర్చించాకే పదవుల భర్తీ
  • ఫిబ్రవరిలో సభ్యత్వ నమోదు
టీఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసం రాష్ట్ర నాయకత్వం జిల్లాల్లో పర్యటించాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నేడు తెలంగాణ భవన్‌లో పార్టీ ప్రధాన కార్యదర్శులతో సమావేశమైన ఆయన కేసీఆర్‌తో చర్చించిన తర్వాతే పదవుల భర్తీపై నిర్ణయం తీసుకుంటామన్నారు.

పంచాయతీ ఎన్నికల బాధ్యతను కేటీఆర్.. ఎమ్మెల్యేలకే అప్పగించారు. జనవరి 14 తర్వాత పార్టీ కార్యాలయాలకు శంకుస్థాపన చేస్తామని.. ఫిబ్రవరిలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శులు ఓటరు నమోదు కార్యక్రమం బాధ్యతలు చూసుకోవాలని ఆయన తెలిపారు. జూన్‌లో పార్టీ కేడర్‌కు శిక్షణ తరగతులు నిర్వహిస్తామని కేటీఆర్ వెల్లడించారు.
KCR
KTR
TRS
Panchayath Elections
Telangana

More Telugu News