Bhutan: భూటాన్‌కు నమ్మకమైన భాగస్వామిగా భారత్ ఉంటుంది: మోదీ

  • రూ.4,500 కోట్ల సాయం అందిస్తాం
  • జల విద్యుత్ ప్రాజెక్టులకు సహకారం
  • భూటాన్ అభివృద్ధిలో ప్రధాన పాత్ర
భూటాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం విదేశీ పర్యటన నిమిత్తం నిన్న తొలిసారిగా షెరింగ్ లొటే భారత పర్యటనకు వచ్చారు. నేడు ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ఆయనతో సమావేశమయ్యారు. ఈ భేటీలో ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చించారు. ఈ సమావేశానంతరం మోదీ చేసిన ప్రకటనలో పలు కీలక అంశాలపై స్పందించారు.

భూటాన్ 12వ పంచవర్ష ప్రణాళిక కోసం భారత్ రూ.4,500 కోట్ల సాయాన్ని అందిస్తుందని మోదీ వెల్లడించారు. భూటాన్‌ అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషించడమే కాకుండా నమ్మకమైన భాగస్వామిగా ఉంటుందని మోదీ స్పష్టం చేశారు. జల విద్యుత్‌కు సంబంధించిన ప్రాజెక్టులకు సహకారం అందిస్తామని ప్రకటించారు. మాంగ్‌దెచ్చు ప్రాజెక్టు పనులు త్వరలోనే పూర్తవుతాయని మోదీ తెలిపారు. 
Bhutan
India
Narendra Modi
Sharing Lote
Delhi

More Telugu News