balakrishna: మోక్షజ్ఞను లాంచ్ చేసే ఆసక్తితో క్రిష్?

షార్ట్స్‌లో చూడండి
బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ హీరోగా తెలుగు తెరకి పరిచయమయ్యే క్షణాల కోసం నందమూరి అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మోక్షజ్ఞతో ఎన్టీఆర్ బయోపిక్ లో ఒక ముఖ్యమైన రోల్ చేయిద్దామని అనుకున్నారు. కానీ సోలో హీరోగానే మోక్షజ్ఞను పరిచయం చేస్తే బాగుంటుందని భావించిన బాలకృష్ణ ఆ ఆలోచనను విరమించుకున్నారు.

ప్రస్తుతం మోక్షజ్ఞ నటనలోను .. డాన్స్ లోను .. హార్స్ రైడింగ్ లోను శిక్షణ పొందుతున్నాడట. ఈ లోగా బాలకృష్ణ మంచి కథ దొరికితే లాక్ చేసే ఆలోచనలో వున్నారని తెలుస్తోంది. మోక్షజ్ఞను లాంచ్ చేసే అవకాశం కోసం చాలామంది దర్శకులు వెయిట్ చేస్తున్నారు. అయితే దర్శకుడు క్రిష్ కి .. బాలకృష్ణకి మధ్య మంచి సాన్నిహిత్యం వుంది. క్రిష్ పనితీరుపై బాలకృష్ణకి నమ్మకం వుంది. ఇక మోక్షజ్ఞను లాంచ్ చేయాలనే ఆసక్తి కూడా క్రిష్ కి వుందట. అందువలన మోక్షజ్ఞ మొదటి సినిమాను క్రిష్ చేసే అవకాశాలు ఎక్కువగానే వున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
Go Back to Shorts
balakrishna
krish

More Telugu News