vijay devarakonda: కాకినాడను మిస్సవుతున్నాను: విజయ్ దేవరకొండ

షార్ట్స్‌లో చూడండి
విజయ్ దేవరకొండ తాజా చిత్రంగా 'డియర్ కామ్రేడ్' నిర్మితమవుతోంది. భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా కొన్ని రోజులుగా కాకినాడలో షూటింగు జరుపుకుంటోంది. తాజాగా ఈ షెడ్యూల్ ముగియడంతో సినిమా టీమ్ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. రెండు నెలలుగా కాకినాడలోనే ఉన్నాము. నెల రోజులపాటు అన్నవరం .. తొండంగి ప్రాంతాల్లో షూట్ చేశాము.

 ఇక్కడ ఇన్ని రోజులుగా నాతో పాటు కలిసి వున్న స్నేహితులు, ఇప్పుడు ఇక్కడి నుంచి నేను వెళ్లిపోతున్నాననగానే ఎమోషనల్ అయ్యారు .. కన్నీళ్లతో వెళ్లిపోయారు. నేను కూడా కాకినాడను .. ఇక్కడి వాళ్లను మిస్సవుతున్నాను. ఫోన్ పక్కన పెట్టేసి ఇక్కడి సముద్రాన్ని చూస్తూ ఎంజాయ్ చేశాను. ఇక్కడి స్టూడెంట్స్ చాలామంది మా సినిమాలో కనిపిస్తారు. దర్శకుడు భరత్ కమ్మ కాకినాడలో పుట్టి పెరగడం వలన, ఈ ప్రదేశాన్ని దృష్టిలో పెట్టుకుని కథ రాశాడు. అందువలన కథలో కాకినాడ ఒక భాగంగా కనిపిస్తుంది. ఈ సినిమా తప్పకుండా యూత్ కి కనెక్ట్ అవుతుందనే నమ్మకం వుంది" అని చెప్పుకొచ్చాడు. 
Go Back to Shorts
vijay devarakonda
rashmika

More Telugu News