vijay devarakonda: కాకినాడ షెడ్యూల్ ను పూర్తి చేసిన 'డియర్ కామ్రేడ్'

  • మెడికల్ స్టూడెంట్ గా విజయ్ దేవరకొండ 
  • కథానాయికగా రష్మిక మందన 
  • మే రెండవ వారంలో విడుదల
'టాక్సీవాలా' సినిమా తర్వాత హీరో విజయ్ దేవరకొండ, తన తదుపరి సినిమా అయిన 'డియర్ కామ్రేడ్' షూటింగుతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా మేజర్ షెడ్యూల్ ను కాకినాడలో ప్లాన్ చేశారు. కొన్ని రోజులుగా అక్కడ చిత్రీకరణ చేస్తూ వస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ మెడికల్ స్టూడెంట్ పాత్రలో కనిపించనున్నాడు.

అందువలన కాకినాడ కాలేజ్ లోను .. ఆ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేస్తూ వచ్చారు. తాజాగా అక్కడి షెడ్యూల్ ను పూర్తి చేశారు. విజయ్ దేవరకొండ .. రష్మిక కాంబినేషన్లో చిత్రీకరించిన సీన్స్ చాలా బాగా వచ్చాయట. అవుట్ పుట్ బాగా వచ్చిందని దర్శక నిర్మాతలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమాకి, భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను మే నెల రెండవ వారంలో విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. 'గీత గోవిందం' తరువాత విజయ్ దేవరకొండ .. రష్మిక కాంబినేషన్లో రానున్న ఈ సినిమాపై సహజంగానే మంచి అంచనాలు వున్నాయి. 
vijay devarakonda
rashmika

More Telugu News