the accidental prime minister: 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్' సినిమాపై మన్మోహన్ సింగ్ స్పందన

షార్ట్స్‌లో చూడండి
'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్' సినిమా ట్రైలర్ దేశ వ్యాప్తంగా వేడిని రాజేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్ పై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. పూర్తి సినిమాను తొలుత తమకు చూపించిన తర్వాతే విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మన్మోహన్ సింగ్, సోనియాగాంధీల గౌరవాన్ని తగ్గించేలా ఈ చిత్రం ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్పట్లో మన్మోహన్ కు మీడియా సలహాదారుగా పనిచేసిన సంజయ్ బారు రచించిన పుస్తకం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

ఈ సినిమాకు సంబంధించి మీడియా ప్రతినిధులు ఈరోజు మన్మోహన్ సింగ్ ను ప్రశ్నించారు. దీనికి ఆయన తన స్పందనగా, 'నో కామెంట్' అంటూ వెళ్లిపోయారు. కాంగ్రెస్ 134వ వ్యవస్థాపకదినం వేడుకల నేపథ్యంలో, ఈరోజు మన్మోహన్ కాంగ్రెస్ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా, 'మీపై తీసిన సినిమాపై మీరు ఏమనుకుంటున్నారు' అని మీడియా ప్రశ్నించింది. ఒక్క క్షణం అక్కడ ఆగి... నో కామెంట్ అంటూ ఆయన అక్కడ నుంచి వెళ్లిపోయారు. 
Go Back to Shorts
the accidental prime minister
manmohan singh
responce

More Telugu News