modi: ఏపీలో ప్రధాని మోదీ పర్యటన రద్దు

  • షెడ్యూల్ ప్రకారం జనవరి 6న ఏపీలో పర్యటించాల్సిన ప్రధాని
  • ఆకస్మిక కార్యక్రమాల వల్ల పర్యటన రద్దు
  • జనవరి నెలాఖరులో కానీ.. ఫిబ్రవరిలో కానీ పర్యటించే అవకాశం
ప్రధాని మోదీ పర్యటన రద్దు అయింది. షెడ్యూల్ ప్రకారం జనవరి 6న ఏపీలో మోదీ పర్యటించాల్సి ఉంది. తొలుత కేరళ పర్యటనను ముగించుకుని... అక్కడి నుంచి నేరుగా ఏపీకి రావాల్సి ఉంది. అయితే, ఆకస్మిక కార్యక్రమాల వల్ల మోదీ తన పర్యటనను రద్దు చేసుకున్నారు. జనవరి నెలాఖరులో కానీ లేదా ఫిబ్రవరి నెలలో కానీ ఏపీలో మోదీ పర్యటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
modi
Andhra Pradesh
tour
visit

More Telugu News