Mumbai: ముంబైలో కలకలం... రూ. 1000 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్ చేసిన పోలీసులు

షార్ట్స్‌లో చూడండి
కొత్త సంవత్సరం వేడుకల్లో వాడే నిమిత్తం ముంబైలో సిద్ధం చేసిన రూ. 1000 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను పోలీసులు సీజ్ చేశారు. వకోలా ప్రాంతంలో నిషేధిత డ్రగ్స్ విక్రయాలు సాగుతున్నాయన్న సమాచారంతో ముంబై క్రైమ్ బ్రాంచ్ లో భాగమైన యాంటీ నార్కోటిక్స్ సెల్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పెద్దఎత్తున ఫెంటానిల్, హెరాయిన్, కొకైన్ లభ్యమయ్యాయి. ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేసి రిమాండుకు పంపామని, కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నామని పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు.
Go Back to Shorts
Mumbai
Police
Drugs
Narcotics
Heroin
Cocaine

More Telugu News