kajal: డబ్బుపిచ్చి ఎక్కువున్న పాత్రలో కాజల్

  • కాజల్ ప్రధాన పాత్రధారిగా 'సీత' 
  • నెగెటివ్ షేడ్స్ కలిగిన రోల్ అంటూ టాక్ 
  • కాజల్ జోడీగా బెల్లంకొండ శ్రీనివాస్
ఒక వైపున నయనతార .. అనుష్క .. త్రిష నటనకి ప్రాధాన్యత గల విభిన్నమైన పాత్రలను చేస్తూ వెళుతున్నారు. కాజల్ మాత్రం ఇంకా గ్లామర్ కి ప్రాధాన్యత కలిగిన పాత్రలనే ఎంచుకుంటూ వస్తోంది. ఇక తాను కూడా కొత్తదనం కలిగిన పాత్రలకి ప్రాముఖ్యతను ఇవ్వాలని నిర్ణయించుకుందేమో, నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రను చేస్తోందట .. అదీ తేజ సినిమాలో.

కథానాయిక ప్రాధాన్యత కలిగిన ఒక కథను తేజ రూపొందిస్తున్నాడు. ఈ సినిమాకి 'సీత' అనే టైటిల్ ను ఖరారు చేసుకున్నాడు. కాజల్ జోడీగా ఇందులో బెల్లంకొండ శ్రీనివాస్ కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు దశలో వుంది. ఇందులో డబ్బు పిచ్చి వున్న యువతిగా .. నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలో కాజల్ కనిపించనుందని తెలుస్తోంది. ఇక నుంచి కథానాయిక ప్రాధాన్యత గల సినిమాలను .. నటనకి ఎక్కువ అవకాశం కలిగిన పాత్రలను కాజల్ నుంచి ఆశించవచ్చునేమో!
kajal
bellamkonda srinivas

More Telugu News