Andhra Pradesh: ఇంటర్ అమ్మాయిలకు అర్ధరాత్రి లైంగిక వేధింపులు.. కీచక ప్రిన్సిపల్ ను అరెస్ట్ చేసిన పోలీసులు!

షార్ట్స్‌లో చూడండి
విద్యార్థులను దారిలో పెట్టాల్సిన టీచర్ దారి తప్పాడు. కామంతో కళ్లు మూసుకుపోయి తన దగ్గర చదువుకుంటున్న అమ్మాయిలను వేధించాడు. చివరికి ఈ విషయాన్ని బాలికలు ఇళ్లలో చెప్పడంతో వాళ్లు పోలీసులను ఆశ్రయించారు. దీంతో సదరు కామాంధుడిని అరెస్ట్ చేసిన పోలీసులు కటకటాల వెనక్కు నెట్టారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని ఎలమంచిలిలో గీతాంజలి డిగ్రీ అండ్‌ ఇంటర్‌ కళాశాలను నిర్వహిస్తున్నారు. దీనికి సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకడైన ఈశ్వరదత్తు కాలేజీ ప్రిన్సిపల్, కార్యదర్శిగా వ్యవహరిస్తున్నాడు.

ఈ కళాశాలలో చదువుతున్న అమ్మాయిలు అక్కడే ఉండే హాస్టల్ లో ఉంటున్నారు. ఈ క్రమంలో ఈ నెల 12న అర్ధరాత్రి ఇంటర్ విద్యార్థినులను తన గదికి పిలిపించుకున్న ఈశ్వరదత్తు, వారితో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు లైంగికంగా వేధించాడు. దీంతో యువతులు ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఈశ్వరదత్తుపై ఐపీసీ 354, 354డీ, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఆయనను కటకటాల వెనక్కు నెట్టారు.
Go Back to Shorts
Andhra Pradesh
Visakhapatnam District
sexual harrasment
Police
principal

More Telugu News