Tirumala: వెంకన్నపై భక్తుల కాసుల వర్షం... గురువారం రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం!

  • రూ. 4.20 కోట్ల ఆదాయం
  • తిరుమలలో కొనసాగుతున్న రద్దీ
  • సర్వదర్శనానికి 20 గంటల సమయం
కోట్లాదిమంది భక్తుల కొంగుబంగారమైన తిరుమల శ్రీ వెంకటేశ్వరుని హుండీ ఆదాయం గురువారం నాడు రికార్డు స్థాయికి పెరిగింది. ఒక్కరోజులో రూ. 4.20 కోట్లు హుండీ ద్వారా వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. తిరుమల వెంకన్నకు సరాసరిన హుండీ ద్వారా మూడు నుంచి మూడున్నర కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. బ్రహ్మోత్సవాల సమయంలో ఈ ఆదాయం మరింతగా పెరుగుతుంది.

 కాగా, తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూకాంప్లెక్స్ లోని అన్ని కంపార్టుమెంట్లూ నిండాయి. సర్వదర్శనానికి 20 గంటలు, టైమ్ స్లాట్ టోకెన్ పొందిన భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. గురువారం నాడు స్వామివారిని 72,882 మంది దర్శించుకోగా, 26,107 మంది తలనీలాలు సమర్పించారు.
Tirumala
Thursday
Tirupati
TTD
Hundi

More Telugu News