KTR: చరణ్ స్పీచ్ బాగుంది.. నా డౌట్ ఏంటంటే... ఫ్యూచర్లో ఎప్పుడో..!: కేటీఆర్ ప్రశంసలు

  • ఎలక్షన్ స్పీచ్ లకన్నా బాగా మాట్లాడాడు
  • మా స్పీచ్ లతో పోలిస్తే బాగుంది
  • పాలిటిక్స్ కు ఇంకా టైముందిలే
  • కేటీఆర్ వ్యాఖ్యలతో మెగాభిమానుల కేరింతలు
భవిష్యత్తులో ఏనాటికైనా రామ్ చరణ్ కూడా రాజకీయాల్లోకి వస్తాడనిపిస్తోందని టీఆర్ఎస్ యువనేత కేటీఆర్ వ్యాఖ్యానించారు. గురువారం రాత్రి హైదరాబాద్, యూసఫ్ గూడలో 'వినయ విధేయ రామ' ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగగా, ముఖ్య అతిథిగా వచ్చిన కేటీఆర్ ఆడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... "నాకైతే ఇప్పుడు చరణ్ స్పీచ్ వింటుంటే... ఏమీ మరచిపోయినట్టు అనిపించలేదు. అన్నీ చెప్పాడు. ఇంకా చెప్పాలంటే, మేము ఎలక్షన్లలో స్పీచ్ లు ఇచ్చిన దానికంటే బాగానే మాట్లాడాడని చెప్పవచ్చు. నా డౌట్ ఏంటంటే... ఫ్యూచర్లో ఎప్పుడో... ఇప్పుడే కాదు... ఇప్పుడే కాదు... టైముంది... టైముంది" అన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలతో మెగా ఫ్యామిలీ అభిమానులు కేరింతలు కొట్టారు.
KTR
Ramcharan
Vinaya Vidheya Rama

More Telugu News