KTR: కేటీఆర్ నా స్నేహితుడు.. మరింత గొప్ప స్థాయికి ఎదగాలి: సినీ హీరో రాంచరణ్

  • ఘనంగా ‘వినయ విధేయ రామ’ ప్రీ రిలీజ్ ఫంక్షన్
  • ముఖ్య అతిథులుగా కేటీఆర్, చిరంజీవి
  • కేటీఆర్‌ను ప్రశంసల్లో ముంచెత్తిన రాంచరణ్
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన కేటీఆర్ తన స్నేహితుడు అని చెప్పుకునేందుకు తాను గర్వపడతానని ప్రముఖ సినీ నటుడు రాంచరణ్ అన్నాడు. రాంచరణ్, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందించిన ‘వినయ విధేయ రామ’ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను గురువారం సాయంత్రం హైదరాబాద్ యూసుఫ్‌గూడలోని పోలీస్ గ్రౌండ్స్‌లో నిర్వహించారు. అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. టీఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, చిరంజీవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా రాంచరణ్ మాట్లాడుతూ.. కేటీఆర్‌ను ప్రశంసల్లో ముంచెత్తాడు. కేటీఆర్ గొప్ప నాయకుడని, యువతకు ఇన్‌స్పిరేషన్ అని పేర్కొన్నాడు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన ఆయనకు అభినందనలు తెలిపాడు. కేటీఆర్ తన స్నేహితుడైనందుకు గర్వంగా ఉందని పేర్కొన్న రాంచరణ్.. ఆయన లవబుల్ పర్సన్ అని పేర్కొన్నాడు. ఈసారి మరింత బాగా పాలించి మంచి పేరు సంపాదించుకోవాలని, మరింత గొప్ప స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నట్టు ఆకాంక్షించాడు. కాగా, డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహించాడు. సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు ఇది రాబోతోంది.
KTR
Ramcharan
TRS
Vinaya vidheya Rama
Tollywood
Chiranjeevi

More Telugu News