Uday Bhaskar: ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. నెలాఖరుకు 25 నోటిఫికేషన్లు

  • గ్రూప్ 1, 2, తదితర పోస్టులకు నోటిఫికేషన్
  • ఆంగ్లంతోపాటు తెలుగు పరీక్షలో ఉత్తీర్ణత తప్పనిసరి
  • తెలుగు, ఆంగ్లం ఉత్తీర్ణులైతేనే మెయిన్స్‌కు అవకాశం
ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ శుభవార్తను అందించింది. ఈ నెలాఖరుకు 25 నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్టు ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్ భాస్కర్ ప్రకటించారు. నేడు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గ్రూప్ 1, 2, డిగ్రీ, జూనియర్, పాలిటెక్నిక్ కళాశాలల అధ్యాపక పోస్టులకు నెలాఖరున నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు వెల్లడించారు. గ్రూప్ 1 పరీక్ష రాసే అభ్యర్థులు ఆంగ్లంతో పాటు.. తెలుగు పరీక్షలో తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుందని.. ఆ తర్వాతే మెయిన్స్ పరీక్ష రాసే అవకాశం ఉంటుందని ఉదయ భాస్కర్ వెల్లడించారు.
Uday Bhaskar
APPSC Chairman
Notifications
Andhra Pradesh
Eluru

More Telugu News