Metro Train: మెట్రో రైలు భూగర్భ సొరంగంలో ప్రయాణిస్తుండగా చెలరేగిన మంటలు

  • కిటికీల నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్న ప్రయాణికులు
  • రవీంద్రసదన్, మైదాన్ స్టేషన్‌ల మధ్య ప్రమాదం
  • తాత్కాలికంగా మెట్రో సర్వీసుల నిలిపివేత
మెట్రో రైలు భూగర్భ సొరంగంలో ప్రయాణిస్తుండగా నేటి సాయంత్రం మంటలు చెలరేగాయి. అంతా కిటికీల నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నప్పటికీ.. 11 మంది మాత్రం పొగకు ఊపిరాడక ఇబ్బంది పడ్డారు. వెంటనే వారిని ఎస్ఎస్‌కేఎం ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. కోల్‌కతాలోని రవీంద్రసదన్, మైదాన్ రైల్వే స్టేషన్ మధ్య సొరంగంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనతో కోల్‌కతా మెట్రో సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ విషయమై మెట్రో రైల్వేస్ అధికారి ఇంద్రాణి బెనర్జీ మాట్లాడుతూ.. ప్రయాణికులందరినీ రక్షించినట్టు.. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని వెల్లడించారు.  


Metro Train
Kolkatha
Rabindrasadan
Maidan
Indrani Benerjee

More Telugu News