Telangana: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ టీబీ రాధాకృష్ణన్

  • ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ టీబీ రాధాకృష్ణన్
  • టీ- హైకోర్టు సీజేగా ఆయన్ని కొనసాగిస్తూ ఉత్తర్వులు
  • టీ- హైకోర్టుకు మరో ఇద్దరు న్యాయమూర్తుల కేటాయింపు
ప్రస్తుతం ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ టీబీ రాధాకృష్ణన్ తెలంగాణ హైకోర్టు సీజేగా కొనసాగనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడ్డాయి. అదే విధంగా, జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ వి.రామసుబ్రమణియన్ లను తెలంగాణ హైకోర్టుకు కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో, తెలంగాణ హైకోర్టుకు కేటాయించిన న్యాయమూర్తుల సంఖ్య 13 కు చేరింది.

 
Telangana
High Court
justice tb radhakrishna

More Telugu News