smuruthi irani: జాన్వీకపూర్ నన్ను అలా పిలిచినందుకు ‘సారీ’ చెప్పింది: కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ

  • ఎయిర్ పోర్టులో కలుసుకున్న స్మృతీ, జాన్వీ 
  • స్మృతీఇరానీని ‘ఆంటీ’ అని సంభోదన
  • ‘ఎవరైనా నన్ను షూట్ చేయండి’ అని అరవాలనిపించింది: స్మృతీ ఇరానీ
మనకు పరిచయం ఉన్న వ్యక్తులను ఏదో ఒక వరుసతో పిలుస్తాం. అదే, మనకు ఏమాత్రం పరిచయం లేని వ్యక్తులను ‘ఆంటీ’ లేదా ‘అంకుల్’ అని సంబోధించడం ప్రస్తుతం చాలా కామన్ అయిపోయింది. సెలెబ్రిటీల కుటుంబాలు పరస్పరం కలుసుకున్నప్పుడు ఈ సంబోధనలను వింటూనే ఉంటాం. అయితే, ‘ఆంటీ’ లేదా ‘అంకుల్’ అని పిలుపు.. కొంతమందికి ఏమాత్రం రుచించదు. ఏమీ అనలేక మౌనంగా ఆ పిలుపును భరించే వారు కొందరైతే, ‘అలా పిలవొద్దు’ అని ప్రత్యక్షంగానో లేక పరోక్షంగానో సున్నితంగా తెలియజెప్పే వారు మరికొందరు.

ఈ తరహా సంఘటనే ఎయిర్ పోర్టులో కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీకి ఎదురైంది. స్మృతీ ఇరానీని బాలీవుడ్ యువ బ్యూటీ జాన్వీకపూర్ కలిసింది. ఇద్దరూ పరస్పరం పలకరించుకున్నారు. సరదాగా ముచ్చటించుకున్నారు. అయితే, ‘ఆంటీ.. ఆంటీ’ అంటూ జాన్వీ సంబోధించడమే స్మృతి ఇరానీకి ఇబ్బంది కలిగించింది. ఈ విషయాన్ని స్మృతీ ఇరానీ ప్రస్తావిస్తూ ఓ పోస్ట్ చేశారు. జాన్వీకపూర్ తనను మాటిమాటికీ ‘ఆంటీ’ అని సంబోధించిందని, ఆ తర్వాత అలా పిలిచినందుకు ‘సారీ’ కూడా చెప్పిందని పేర్కొన్నారు. అందుకు, తాను స్పందిస్తూ ‘ఏం ఫర్వాలేదు బేటా..’ అని చెప్పానని తెలిపారు. తనను అలా ‘ఆంటీ’ అని పిలుస్తుంటే ‘ఎవరైనా నన్ను షూట్ చేయండి’ అని అరవాలనిపించిందని స్మృతీ ఇరానీ చెప్పుకొచ్చారు.
smuruthi irani
janvikapoor
Bollywood
minister

More Telugu News