Jagan: 'మీ వాడు' కాదు జేసీ... రాజకీయ యోధుడు మా జగన్!: వైకాపా రిటార్డ్
- ప్రతి ప్రసంగంలో జగన్ ను 'మా వాడు' అంటూ జేసీ విమర్శలు
- నోరు అదుపులో పెట్టుకోవాలన్న పీడీ రంగయ్య
- లేకుంటే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరిక
టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, తన ప్రతి ప్రసంగంలో వైఎస్ జగన్ ను 'మా వాడు' అని సంబోధిస్తూ, దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని, చంద్రబాబు స్వార్థ రాజకీయాలను తిప్పికొడుతున్న ప్రజా యోధుడు జగన్ అని గుర్తు పెట్టుకోవాలని అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గ వైకాపా సమన్వయకర్త పీడీ రంగయ్య హెచ్చరించారు. నిన్న అనంతపురం సభలో జేసీ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన, జగన్ కు ప్రజల గుండెల్లో సుస్థిరమైన స్థానముందని, అధికార పార్టీ కుట్రలను దీటుగా ఎదుర్కొంటున్న నేత ఆయనని అన్నారు.
చంద్రబాబు భజన చేయడమే జేసీ చేస్తున్న పనని, ఆయన దాన్ని మానుకుని జిల్లాలో కరవు నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తే సంతోషిస్తామని అన్నారు. జిల్లాలో సీనియర్ నేతగా హుందాతనాన్ని చూపాల్సిన జేసీ, చంద్రబాబు మెప్పు కోసం ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని, ఆయన తన నోటిని అదుపులో పెట్టుకోవాలని, లేకుంటే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.