Vijayashanthi: కేసీఆర్‌ వేసుకున్న బీజేపీ ముసుగు త్వరలోనే తొలగిపోతుంది: విజయశాంతి

  • ఫెడరల్ ఫ్రంట్ పేరుతో నాటకాలు
  • యూపీఏ బలపడకుండా కుట్ర
  • బీజేపీ రుణం తీర్చుకునేందుకు ఆరాటం
కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయశాంతి.. తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. ఎన్డీఏ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రధాన పార్టీలన్నీ ఏకమవుతుంటే.. యూపీఏ బలపడకుండా అడ్డుకునేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు.

మళ్లీ ఎన్టీఏను అధికారంలోకి తీసుకువచ్చేందుకే కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పేరుతో నాటకాలు ఆడుతున్నారని ఆమె దుయ్యబట్టారు. సీఎంలు నవీన్ పట్నాయక్, మమతా బెనర్జీలతో కేసీఆర్ భేటీ కావడం కేసీఆర్ కుట్రలో భాగమేనని విజయశాంతి విమర్శించారు. తెర వెనుక నుంచి సహకరించిన బీజేపీ రుణం తీర్చుకునేందుకు కేసీఆర్ ఆరాటపడుతున్నారని.. త్వరలోనే ఆయన వేసుకున్న బీజేపీ ముసుగు తొలగిపోవడం ఖాయమన్నారు.
Vijayashanthi
KCR
BJP
Naveen Patnyak
Mamatha Benerjee

More Telugu News