Sagar: అసభ్యంగా మెసేజ్‌లు పెడుతున్న ఉపాధ్యాయుడిపై విద్యార్థినుల ఫిర్యాదు

  • అసభ్యంగా ప్రవర్తించిన సాగర్
  • వాట్సాప్‌ ద్వారా వేధింపులు
  • షీటీమ్‌ని ఆశ్రయించిన విద్యార్థినులు
విద్యార్థులకు మంచి మార్గాన్ని సూచించాల్సిన గురువే దారి తప్పాడు. విద్యార్థుల భవిష్యత్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయుడే తమ కళాశాలలోని విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. హైదరాబాద్‌లోని కుషాయిగూడలో విశ్వ చైతన్య మహిళా కళాశాలలో సాగర్ అనే ఉపాధ్యాయుడు తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా వాట్సాప్‌లో అసభ్యకరమైన మెసేజ్‌లు పెడుతూ వేధిస్తున్నాడని విద్యార్థినులు షీటీమ్‌ని ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Sagar
Viswa Chaitanya college
Whatsapp
Kushaiguda
She Team

More Telugu News