sj surya: హీరోగా ఎస్.జె.సూర్య .. కీలకమైన పాత్రలో అమితాబ్

  • హీరోగా ఎస్.జె.సూర్య 
  • దర్శకుడిగా తమిళ్ వానన్ 
  • ఇంతవరకూ ఎవరూ టచ్ చేయని కథ         
ఒక వైపున వరుస హిందీ సినిమాలు చేస్తూనే, తన స్థాయికి తగిన పాత్రలు సౌత్ సినిమాల నుంచి వచ్చినా అమితాబ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. చిరంజీవి కెరియర్లోనే భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న 'సైరా' సినిమాలోనూ అమితాబ్ ఒక కీలకమైన రోల్ చేశారు. విభిన్నమైన లుక్ తో ఆయన చేసిన ఈ పాత్ర, ఈ సినిమాకి హైలైట్ గా నిలవనుందని అంటున్నారు.

ఇక త్వరలో ఆయన ఒక ద్విభాషా చిత్రం చేయడానికి సిద్ధమవుతున్నారు. ఎస్.జె. సూర్య కథానాయకుడిగా నటించనున్న ఈ సినిమాకి తమిళ్ వానన్ దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం అమితాబ్ ను ఎంచుకున్నారు. తమిళ .. హిందీ భాషల్లో ఈ సినిమా నిర్మితం కానుంది. తమిళంలో 'ఉయరంద మనిదన్' .. హిందీలో 'ది గ్రేట్ మ్యాన్'అనే టైటిల్ ను ఖరారు చేసుకున్నారు. ఇంతవరకూ ఎవరూ టచ్ చేయని కథతో ఈ సినిమా రూపొందుతుందనేది దర్శకనిర్మాతలు చెబుతున్న మాట. 
sj surya
amitab

More Telugu News