pm: ప్రధాని మోదీతో భేటీ అయిన సీఎం కేసీఆర్
ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. 7 లోక్ కల్యాణ్ మార్గ్ లోని మోదీ నివాసంలో ఆయన్ని కేసీఆర్ కలుసుకున్నారు. తెలంగాణ సీఎంగా కేసీఆర్ రెండోసారి బాధ్యతలు స్వీకరించిన అనంతరం మోదీని ఆయన కలవడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు, విభజన హామీలపై కేసీఆర్ చర్చిస్తున్నారు. ముఖ్యంగా హైకోర్టు విభజనకు వీలైనంత త్వరగా గెజిట్ విడుదలయ్యేలా చూడాలని కేసీఆర్ కోరనున్నారు.