Andhra Pradesh: వంగవీటి రంగా కులమతాలకు అతీతుడైన మహానాయకుడు!: కొడాలి నాని

  • అన్నివర్గాల్లో ఆయనకు అభిమానులున్నారు
  • నాలుగేళ్లే పదవిలో ఉన్నా మంచి పేరు తెచ్చుకున్నారు
  • ప్రజల గుండెల్లో రంగా చిరంజీవిగా ఉన్నారు
వంగవీటి రంగా కులాలకు, మతాలకు, జాతులకు అతీతుడైన మహానాయకుడని వైసీపీ నేత కొడాలి నాని తెలిపారు. అందుకే ఆయనకు అన్నివర్గాల్లోనూ అభిమానులు ఉన్నారని వ్యాఖ్యానించారు. కేవలం నాలుగేళ్లు మాత్రమే ఎమ్మెల్యేగా పనిచేసినా మోహన్ రంగా చాలా మంచి పేరును సంపాదించుకున్నారని పేర్కొన్నారు. దీంతో రంగా తమకు అడ్డంగా ఉన్నారని భావించిన కొంతమంది దుండగులు దారుణంగా హత్యచేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు ప్రజలందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. వంగవీటి రంగా 30వ వర్ధంతి సందర్భంగా కాటూరులోని స్మృతివనంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రంగాను భౌతికంగా అంతం చేసినా, ప్రజల గుండెల్లో ఆయన చిరంజీవిగానే ఉన్నారని నాని తెలిపారు.
Andhra Pradesh
vangaveeti ranga
Kodali Nani
deatha nniversary

More Telugu News